వేములవాడ: శ్రావణ శుక్రవారం సందర్భంగా వేములవాడ రాజన్నను 30 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తుల ద్వారా రూ.28లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఏర్పాట్లను ఈవో రాధాభాయి, ఏఈవోలు, పర్యవేక్షకులు పరిశీలించారు. వేలాదిగా తరలివస్తున్న భక్తులకు మరింత భద్రత కల్పించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా శుక్రవారం బాంబ్‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించింది.
రాజన్నకు శ్రావణ మొక్కులు
