జగిత్యాల: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామంలో గురువారం కుక్క పిల్లలకు బారసాల (పురుడు) వేడుకలు నిర్వహించారు. గ్రామానికి చెందిన గుంటుక జగదీశ్వర్-నందిని, గట్ల శేఖర్-లక్ష్మి, గట్ల అంజయ్య-విజయ దంపతులు కలిసి ఈ వేడుకలు జరిపారు. గ్రామానికి చెందిన గట్ల అంజయ్య తన ఇంటి సమీపంలో కొత్తగా ఇంటి నిర్మాణం చేపడుతుండగా.. అందులో కుక్కకు పిల్లలు పుట్టాయి. కుక్క పిల్లలకు వేడుకలు నిర్వహిస్తే మంచిదని ప్రత్యేకంగా పురుడు నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. వాటికి డ్రెస్సులు కుట్టించి పలువురికి భోజనాలు పెట్టినట్లు తెలిపారు. చూసేందుకు ప్రజలు రావడంతో సందడి నెలకొంది.

