సిద్దిపేట: ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇటీవల డాక్టరేట్ అందుకున్న సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రశాంత్ నగర్ కు చెందిన సీమా నాజ్ నీన్ ను ఆదివారం సిద్దిపేట ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఉన్నత చదువుల్లో మహిళలు రాణించాలని ఫౌండేషన్ ప్రతినిధులు లాయఖ్ మొయినొద్దీన్, అజీముద్దీన్ కోరారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యాభివృద్ధి, పేదలకు సహాయం చేస్తున్నట్టు వారు పేర్కొన్నారు.
డాక్టర్ సీమకు సన్మానం
