- మాజీ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట: పిల్లలకు ర్యాంక్ మార్కుల చదువుతోపాటు సామాజిక బాధ్యత, మానవ విలువలు గూర్చి కూడా నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలోని కొండ భూదేవి గార్డేన్‌లో తెలంగాణ ప్రైవేటు టీచర్స్ అసోసియేషన్ (టీపీఎస్ఏ) ఆధ్వర్యంలో గురుపూజోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ఉత్తమ ఉపాధ్యాయులను ఆయన సన్మానించారు. కార్పొరేట్ పాఠశాలల మధ్య చిన్న పాఠశాలలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విద్యార్థులకు ఉపాధ్యాయులు.. జీవితపాఠాలు, ఉన్నతమైన విలువలు నేర్పించాలి. సిద్దిపేటలో విద్యార్థుల కోసం క్రీడామైదానాలు తెచ్చాం. అని మాజీ మంత్రి అన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు రావడంతో బడ్జెట్ స్కూల్ పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. విద్యార్థులు సెల్‌ఫోన్ వాడకం తగ్గించి పుస్తక పఠనం చేస్తే జీవిత పాఠాలు నేర్చుకోవచ్చని హితవు పలికారు. ఒత్తిడిని తట్టుకోలేక చాలామంది పిల్లలు, యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒత్తిడిని జయించే మనో ధైర్యం ఉండాలన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తోంది…
’కాంగ్రెస్ మంది నిరుద్యోగులను దగా చేస్తోంది అని మండిపడ్డారు. నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తా.’ అని మాజీ మంత్రి హరీశ్రాఉ అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, భారాస రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ. చిన్నకోడూరు మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, శిక్షణ శిబిరం నిర్వాహకుడు గందె నరేశ్, భాషా, పాల సాయిరాం, రాజనర్సు, మోహన్‌లాల్, కొండం సంపత్‌రెడ్డి, వాసవిక్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు హరిధర్, రీజి యన్ చైర్మన్ చింత రాజేంద్రప్రసాద్, టీపీఎస్ఏ జిల్లా అధ్యక్షుడు భగవాన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


