నంది పంపుహౌస్‌ నుంచి ఎత్తిపోతలు ప్రారంభం

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నంది పంపుహౌస్‌ నుంచి బుధవారం గోదావరి నీళ్ల ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. రామగుండం సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్‌ఫో​ పెరగడంతో గ్రావిటీ కాలువ ద్వారా నంది పంపుహౌస్‌లోకి గోదావరి నీళ్లు తరలివస్తున్నాయి. దీంతో పంపుహౌస్‌లోని మూడు భారీ విద్యుత్‌ మోటార్లను ఆన్‌చేసి నీటిని ఎత్తిపోస్తున్నట్లు ఏఈ వెంకట్‌ తెలిపారు. ఒకో‍్క మోటార్‌ ద్వారా 3,150 క్యూసెక్కులను మేడారం రిజర్వాయర్‌కు ఎత్తిపోస్తున్నామని, అక్కడినుంచి గాయత్రీ పంపుహౌస్‌కు తరిలిస్తున్నామని ఆయన వివరించారు.