తెలుగు వెలుగు పాటల పోటీకి ఆహ్వానం

కరీంనగర్‌: గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకుని నిర్వహించే తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా భవానీ సాహిత్య వేదిక, కరీంనగర్‌ ఆధ్వర్యంలో ‘తెలుగు వెలుగు’ పాటల పోటీ నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు వైరాగ్యం ప్రభాకర్‌ తెలిపారు. అన్నాడి గజేందర్‌రెడ్డి రచించిన ‘తెలుగు వెలుగు’ పాటను ఆధారంగా చేసుకుని నిర్వహించే ఈ పోటీలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన విద్యార్థులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను జూనియర్‌ విభాగంలో, ఇంటర్‌ నుంచి పైతరగతులు చదువుతున్న వారిని సీనియర్‌ విభాగంలో పోటీకి ఎంపిక చేస్తామని తెలిపారు. రెండు విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 20లోగా 90145 59059 నంబర్‌కు ఫోన్‌ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.