ఎల్లంపల్లికి జలకళ

గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు నిలిపివేయడంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. నీటి పారుదలశాఖ అధికారులు శుక్రవారం తెలిపిన వివరాల మేరకు.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 147.31 మీటర్లు ఉంది. నీటినిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.30 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి 5,512 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తోంది.