కరీంనగర్: ఇల్లంతకుంట మండలంరహీంఖాన్‌పేట రైతుల జలకళ నెరవేరింది. మండలంలోని ఏ చెరువు, కుంటలు నిండకపోగా.. సింగరాయకుంట మాత్రమే జలకళ సంతరించుకుంది. వేసవిలో ఉపాధిహామీ నిధులతో చేసిన కాల్వ పనులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. చిన్నపాటి వర్షాలకే రహీంఖాన్‌పేటలోని సింగరాయకుంట అలుగు దుంకుతోంది.
మండలలోని రహీంఖాన్‌పేటలోని సింగరాయకుంట ఎండిపోయింది. సింగరాయకుంటలో నీళ్లు రావాలంటే అనంతారం ప్రాజెక్టు దిగువన బిక్కవాగులో నుంచి 5 కిలోమీటర్ల మేర చిన్న మట్టి కాల్వను తవ్వారు. ఇందుకు ఉపాధిహామీ నిధులు దాదాపు రూ.17లక్షలు వెచ్చించి 45 రోజులు శ్రమించారు. దాదాపు 5 కిలోమీటర్ల పొడవు మట్టికాలువ తవ్వారు. ఇటీవల కురిసిన వర్షాలకు బిక్కవాగులోని వరదనీరు ఈ కాలువ ద్వారా ప్రవహించి సింగరాయకుంటలోకి చేరింది. ప్రస్తుతం అలుగు పారుతోంది. ఇప్పటి వరకు మండలంలో ఏ గ్రామంలోని కుంటలోకి నీరు అంతగా చేరలేదు. అన్ని ఎండిపోయి కనిపిస్తున్నాయి. సింగరాయకుంట నిండితే రహీంఖాన్‌పేట దిగువన గ్రామాలు వల్లంపట్ల, వంతడుపుల, నారెడ్డిపల్లి రైతులకు లాభం చేకూరుతుంది.
అలుగు దుంకుతోంది
