పెద్దపల్లి: ‘నాకు నీవు రక్ష.. నీకు నేను రక్ష..’ అని అన్నాచెల్లెళ్లు, తండ్రీకూతుళ్లు, స్నేహితులకు శ్రావణ పౌర్ణమి సందర్భంగా రాఖీ కట్టి పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి జిల్లా రాంపల్లి (పెద్దపల్లి మండలం) గ్రామానికి చెందిన రాజయ్య రెండేళ్ల క్రితం గుండెపోటుతో మరణించాడు. అంతకుముందు ఏటా రాఖీ పండుగ సందర్భంగా మెట్టినిల్లు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం భీంరాజ్‌పల్లి నుంచి ఆయన కూతురు బొమ్మెన మాధవి రాంపల్లిలోని పుట్టింటికి వచ్చేది. తండ్రి రాజయ్యకు రాఖీ కట్టేది. ఈ క్రమంలోనే తన తండ్రి ఆత్మీయతను గుర్తుచేసుకుంటూ శనివారం రాఖీ పండుగ సందర్భంగా రాంపల్లిలోని తండ్రి సమాధికి రాఖీ కట్టింది. తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంది.
సమాధికి రాఖీ కట్టి
