గోదావరిఖని: విధుల్లో నిర్లక్ష్యం వహించిన రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్.హనుమంతరావు నాయక్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ డి.కిరణ్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్లు కమిషనర్ జె.అరుణశ్రీ తెలిపారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన మొబైల్ అప్లికేషన్‌లో వివరాలు సకాలంలో అప్‌డేట్ చేయించడంలో పర్యవేక్షణ లోపం, టీయూఎఫ్‌ఐడీసీ తదితర పథకాల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయించడంలో అలసత్వంతో ఇద్దరు ఉదో‍్యగులను సరెండర్ చేశామన్నారు. అలాగే, ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా చేపట్టాల్సిన పారిశుధ్య పనులను అమలు చేయడంలో నిర్లక్ష్యంతోపాటు తనకు కేటాయించిన డివిజన్లలో సమస్యలు పరిష్కరించడంలో విఫలమైన శానిటరీ ఇన్‌స్పెక్టర్‌నూ సరెండర్ చేశామని వివరించారు.
ఇద్దరు బల్దియా అధికారుల సరెండర్
