జగిత్యాల: మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యురాలిగా పనిచేసి.. ఇటీవల ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో లొంగిపోయిన బత్తుల గాంబాలు అలియాస్ పసుల వసంత జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండలో ఉంటున్న తన అన్న బత్తుల రాజంకు శనివారం రాఖీ కట్టారు. సుమారు 40 ఏళ్ల తర్వాత అన్నకు రాఖీ కట్టడంతో కుటుంబసభ్యులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. గాంబాలు సుమారు 40 ఏళ్ల క్రితం మావోయిస్టు దళంలో చేరారు. అప్పటి నుంచి కుటుంబసభ్యులకు దూరంగానే ఉంటున్నారు. నాలుగు నెలల క్రితం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో లొంగిపోయి ప్రస్తుతం కోరుట్లలో నివాసం ఉంటున్నారు. రాఖీ పండుగ సందర్భంగా సిరికొండ గ్రామానికి వచ్చి ఆమె తన అన్న రాజంకు రాఖీ కట్టారు.
40 ఏళ్ల తర్వాత అన్నకు రాఖీ
