సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సెలెస్టియల్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌లో గురువారం ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో ఆకట్టకున్నారు. వసుదేవుని పాటలకు అనుగుణంగా నృత్యాలు చేసి అలరించారు. ఉట్టి కొట్టేందుకు పోటీపడ్డారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు వై.హన్మంతరెడ్డి, బి. శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ కె.విక్రమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సెలెస్టియల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
