కరీంనగర్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పోలీసు పరేడ్ మైదానంలో కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ బధిర విద్యార్థులతో కలిసి ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌లో జాతీయగీతాన్ని ఆలపించారు. దివ్యాంగుల భావాన్ని అర్థం చేసుకుని వారి సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా అధికారులకు ఇండియన్ సైన్ లాంగ్వేజ్ బేసిక్స్‌పై కలెక్టర్ పమేలా సత్పతి శిక్షణ ఇప్పించారు. ఏడు రోజుల్లో సైన్ లాంగ్వేజ్‌లో బేసిక్స్ నేర్చుకున్నారు. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అధికారులంతా కలిసి ప్రదర్శన ఇచ్చారు
సైన్ లాంగ్వేజ్‌లో కలెక్టర్ జాతీయ గీతాలాపన
