Job mela: రేపు జాబ్‌ మేళా

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలోని ఇంటర్‌ విద్యార్థులకు హెచ్‌సీఎల్‌ టెక్‌బీ ఆధ్వర్యంలో శనివారం ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు డీఐఈవో గురువారం తెలిపారు. 2024-26 మధ్య ఇంటర్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉదయం 10 గంటలకు నగరంలోని స్పేస్‌ కంప్యూటర్‌ కార్యాలయంలో రిపోర్టు చేయాలన్నారు. ఎంపీసీ, ఎంఈసీ, సీఈసీ, వొకేషనల్, కంప్యూటర్స్‌లో మొత్తంగా 75 శాతం, గణితంలో 60శాతం మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. విద్యార్థులు పదోతరగతి, ఇంటర్‌ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు, ఫోటో, ఆండ్రాయిడ్‌మొబైల్‌తో హాజరుకావాలన్నారు. వివరాలకు 6303207394, 7981834205 నంబర్‌లను సంప్రదించాలని పేర్కొన్నారు.