DRDO: 764 ఉద్యోగాలు ఖాళీ

Gullshan Desk: DRDO…డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పనిచేసే సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (CEPTAM).. రక్షణరంగంలో 764 పోస్టుల ఖాళీల భరీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలు రెండు ప్రధాన కేటగిరీలలో ఉన్నాయి. ఆన్‌లైన్ అప్లికేషన్ల ప్రారంభ తేదీ: డిసెంబర్ 9 నుంచి అభ్యర్థులు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

01. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి (STA-B)
02. టెక్నీషియన్-ఎ (Tech-A).

మొత్తం పోస్టుల సంఖ్య: 764
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి (STA-B): 561 పోస్టులు
టెక్నీషియన్-ఎ (Tech-A): 203 పోస్టులు

వయస్సు: అభ్యర్థుల కనీస వయస్సు 18-28 ఏళ్లు. SC/ST/OBC/EWS వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు గరిష్ట వయస్సులో సడలింపు ఉంటుంది.

జీతం: DRDO- CWPTAM రిక్రూట్‌మెంట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుంది.

01. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి (STA-B)పోస్టులకు జీతం నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు ఉంటుంది.
02. టెక్నీషియన్-ఎ (Tech-A) పోస్టులకు జీతం నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు ఉంటుంది.

Note: విద్యార్హతలు, ఎంపిక విధానం (ట్రైనింగ్, పరీక్షలు), అప్లికేషన్ ఫీజు, చివరి తేదీతో పాటు ఇతర పూర్తి సమాచారంతో పూర్తి నోటిఫికేషన్ DRDO అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలో విడుదల కానుంది. ఇందుకోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయవచ్చు.