Think and vote: ఆలోచించి ఓటేయండి

  •  పల్లె ప్రగతికి పైసలు ఇస్తుంది మోదీ ప్రభుత్వమే
  • కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి
  •  గ్రామాల అభివృద్ధి కోసం బీజేపీ బలపర్చిన అభ్యర్థులకే ఓటేసి గెలిపించండి
  •  కరీంనగర్ పార్లమెంట్ గ్రామీణ ఓటర్లకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపు

Gullshan Desk: గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఓటేసే ముందు ఒక్క క్షణం ఆలోచించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విజ్ఝప్తి చేశారు. పల్లె ప్రగతికి పాటుపడుతుంది పైసలిస్తోంది మోదీ ప్రభుత్వమేనని, ఇప్పటి వరకు గ్రామాల్లో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులతో చేపట్టినవేనని స్పష్టం చేశారు. రైతు వేదిక నుండి శ్మశాన వాటిక దాకా, రోడ్ల నిర్మాణం మొదలు వీధి దీపాల దాకా ఆఖరికి గ్రామాల్లో జరిగే పారిశుధ్య పనులకు సైతం కేంద్ర నిధులు వెచ్చిస్తున్నారని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ‘‘గాడిద గుడ్డు’’ మాత్రమేనని విమర్శించారు. పచ్చని పల్లెలలకు పైసా ఇయ్యకుండా, చేసిన పనులకు బిల్లులియ్యకుండా సర్పంచులు ఆత్మహత్య చేసుకునే దుస్థితికి తెచ్చింది బీఆర్‌ఎస్‌ యేనని విమర్శించారు.  గ్రామాల అభివృద్ధికి పైసలిస్తున్న బీజేపీ బలపర్చిన అభ్యర్థులకు గెలిపించి గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుని ఆదర్శంగా తీర్చిదిద్దుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.  పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ పనులు… నిధుల వివరాలు వెల్లడించారు.

గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు
రైతు వేదిక నిర్మాణానికి రూ.10 లక్షలు
పల్లె ప్రకృతి వనానికి రూ. 4.23 లక్షలు
శ్మశాన వాటిక నిర్మాణం కోసం రూ.11.13 లక్షలు
డంపింగ్ యార్డ్ నిర్మాణానికి రూ.2.50 లక్షలు
నర్సరీలకు రూ.1.56 లక్షలు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రూ.12 లక్షలు
ఇంటింటికీ మరుగుదొడ్డి కోసం రూ.12 వేలు
ప్రభుత్వం పేదలకు కట్టించే ప్రతీ ఇంటికి రూ.1.20 లక్షలు
ప్రతీ రైతుకు ఎరువుల సబ్సిడీ పేరిట ఒక్కో ఎకరానికి రూ.18,600 వేలు
రేషన్ కార్డు ద్వారా ఏటా రూ.8 వేల విలువ చేసే బియ్యం ఉచితం
పేదలకు రూ.2.800 విలువచేసే గ్యాస్ కనెక్షన్ ఫ్రీ, ప్రతీ సిలిండర్‌పై రూ.200 సబ్సిడీ
మన ఊరిలో వెలిగే వీధిదీపాల, హైమాస్ట్ లైట్ల పైసలు కేంద్రానివే..
ఉపాధి హామీ పథకం ద్వారా 100 రోజులు పని
ప్రధానమంత్రి సడక్ యోజన, సీఐఆర్ఎఫ్ ద్వారా రోడ్ల నిర్మాణం
ప్రతీ పేదవాడికి నయాపైసా ఖర్చులేకుండా బ్యాంక్ అకౌంట్
జాతీయ రహదారుల నిర్మాణానికి వేల కోట్ల నిధులు
అన్ని గ్రామపంచాయతీ భవనాలకు నిధులు
అంగన్వాడి కేంద్రాలకు నిధులు
ప్రాధమిక ఆరోగ్య కేంద్ర భవనాల నిర్మాణం, పల్లె దవఖానాల నిర్మాణం

జాతీయ రహదారుల నిర్మాణం కోసం నిధులు
కరీంనగర్ నుంచి వరంగల్ NH563-4 లేన్ల రోడ్డు విస్తరణ పనులకు రూ. 2,146.86 కోట్లు
ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట NH-765DG రోడ్డు విస్తరణ పనులకు రూ. 578 కోట్లు
కరీంనగర్ నుంచి జగిత్యాల NH563-4 లేన్ల రోడ్డు విస్తరణ పనుల కోసం రూ. 1900 కోట్లు

సెంట్రల్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా రోడ్ల నిర్మాణానికి నిధులు

కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల కల్పననిధి (CRIF) కింద పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్, హుస్నాబాద్, హుజూరాబాద్, మానకొండూరు, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లోని పలు మండలాలకు అనుసంధానంగా రూ.219.5 కోట్లతో 150.7 కిలోమీటర్ల పొడవుతో 12 రోడ్డు పనులు చేపట్టినం.

మారుమూల గ్రామాలకు సైతం రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణం కోసం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా 23 మండలాల్లోని మారుమూల గ్రామాలకు రోడ్లు, బ్రిడ్జిలు వేసేందుకు రూ. 116 కోట్లు మంజూరు చేయించినం. ఆయా గ్రామాల్లో మొత్తం 191.49 కిలోమీటర్ల పొడవుతో 32 రోడ్ల నిర్మాణం పూర్తయ్యాయి.
గన్నేరువరం ప్రజల చిరకాల వాంఛ అయిన మానేరు నదిపై హైలెవల్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం రూ.77 కోట్లు
ఆర్నకొండ-మల్యాల డబుల్ రోడ్డు విస్తరణ పనుల కోసం రూ.50 కోట్లు
వేములవాడ-సిరికొండ రోడ్డు నిర్మాణానికి రూ.23 కోట్లు
కరీంనగర్ జిల్లాలోని విలాసాగర్ మీదుగా కోరేపల్లి నుంచి తనుగుల రోడ్డుకు వరకు రూ.10 కోట్లు
కరీంనగర్ జిల్లాలోని చల్లూరు నుంచి కేశవపట్నం డబుల్‌ లేన్‌ రోడ్డు కోసం రూ.25 కోట్లు
కరీంనగర్ జిల్లాలోని బావుపేట (ఆసీఫ్‌నగర్) నుంచి ఫకీర్‌పేట, కురిక్యాల రోడ్డు వరకు డబుల్‌ లేన్‌ కోసం రూ.24 కోట్లు. కరీంనగర్ జిల్లాలోని తాడికల్ నుంచి యరడపల్లె వరకు డబుల్‌ లేన్‌ రోడ్డు కోసం రూ.13.5 కోట్లు
కరీంనగర్ జిల్లాలోని ఇందుర్తి నుంచి సుందరగిరి వరకు డబుల్‌ లేన్‌ కోసం రూ.15 కోట్లు
జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి నుంచి గోవిందారం వరకు రూ.20 కోట్ల వ్యయంతో డబుల్‌ రోడ్డు
జగిత్యాల జిల్లాలోని NH-63 నుంచి రంగపేట వరకు రూ.15 కోట్లతో రోడ్డు నిర్మాణం
జగిత్యాల జిల్లాలో మల్లియాల్ నుంచి పెగడపల్లి వరకు రూ.20 కోట్లతో రోడ్డు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పెద్దలింగాపూర్ నుంచి బద్దెనపల్లి, రామన్నపల్లి, బస్వాపూర్ మీదుగా రూ.20 కోట్ల వ్యయంతో 14 కి.మీ మేరకు రోడ్డు నిర్మాణం
రాజన్న సిరిసిల్ల జిల్లా మల్లారెడ్డిపేట మీదుగా లింగన్నపేట నుంచి కోరుట్లపేట వరకు రూ.15 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణం
సిద్దిపేట జిల్లాలోని ఇందుర్తి నుంచి హుస్నాబాద్ వరకు రూ.24 కోట్లతో 16 కి.మీల మేరకు డబుల్ లేన్
సిద్దిపేట జిల్లాలోని PWD రహదారి శనిగరం నుంచి సుందరగిరి వరకు రూ.18 కోట్లతో రోడ్డు నిర్మాణం

పేద, మధ్య తరగతి ప్రజల కోసం చేసిన మచ్చుకు కొన్ని సేవలు
ప్రభుత్వ, శిశు మందిర్ పాఠశాలల్లో టెన్త్ చదువుకునే విద్యార్థులకు ‘మోదీ గిఫ్ట్’ పేరుతో ఉచితంగా 20 వేల బ్రాండెడ్ సైకిళ్లను పంపిణీ. త్వరలో ప్రభుత్వ స్కూళ్లలో 9వ తరగతి చదివే విద్యార్థులందరికీ సైకిళ్లు
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రభుత్వ స్కూళ్లలో ఒకటి నుంచి 6వ తరగతి వరకు చదువుకునే పిల్లలకు ‘మెదీ కిట్’ పేరుతో నోట్స్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్స్, బ్రాండెడ్ స్కూల్ బ్యాగ్
ప్రతీ ఊరిలో వివిధ సామాజిక వర్గాలు నిర్మించే కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి ఎంపీ లాడ్స్ నిధులు
ప్రతీ ఊరిలో బోర్లు వేసుకునేందుకు అవసరమైన మేరకు ఎంపీ లాడ్స్, సీఎస్సార్ నిధులు
పేద, మధ్య తరగతి ప్రజలు టెస్టుల కోసం కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి రూ.3 కోట్ల విలువైన అంబులెన్సులు, ఎక్సరే మిషన్ సహా మెడికల్ ఎక్విప్ మెంట్స్
వేములవాడ, హుస్నాబాద్, హుజూరాబాద్, జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.5 కోట్ల విలువైన అత్యాధునిక మెడికల్ ఎక్విప్ మెంట్స్
కరీంనగర్, సిరిసిల్ల మెడికల్ కాలేజీల విద్యార్థుల కోసం ఉచితంగా బస్సు సౌకర్యం. ఆయా మెడికల్ కాలేజీ హాస్టళ్లలో వాటర్ ప్లాంట్స్, ఫ్యాన్లు, ఇతర మౌలిక సదుపాయాలు
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో వందలాది స్కూళ్లలో ఫర్నిచర్, ఇతర మౌలిక సదుపాయాలు

కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలకు నయాపైసా రాలే..
రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసల్లేవు. నన్ను కోసినా నయాపైసా రాదు. అని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే చెబుతున్నడు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలోనూ గ్రామ పంచాయతీల అభివృద్ధికి పైసా ఇయ్యలేదు. అప్పులు తెచ్చి అభివృద్ధి చేసిన సర్పంచులకు బిల్లులు రాక అప్పులపాలై ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఏర్పడటమే నిదర్శనం. గెలిచిన ఎమ్మెల్యేలకు నియోజకవర్గాన్ని అభివ్రుద్ధి చేసుకునేందుకు ప్రత్యేకంగా నిధులు కూడా లేవు. పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ, కేంద్ర మంత్రిగా ఉన్న నాకు మాత్రమే ఎంపీ లాడ్స్ నిధులు ఉన్నాయి. సీఎస్సార్, ఎంపీలాడ్స్ సహా అనేక రూపాల్లో పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి గ్రామాల అభివ్రుద్ధికి కృషి చేస్తున్నానని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించాలని కోరారు.