‘కొత్త కవుల వేదిక’ కరీంనగర్‌

కరీంనగర్‌: కొత్త కవులకు కవిత్వ రచనలో శిక్షణ ఇచ్చే ఉత్తమ వేదిక ఎన్నీల ముచ్చట్లు అని వైద్యుడు డి.రఘురామన్‌ తెలిపారు. తెలంగాణ రచయితల వేదిక జిల్లాశాఖ ఆధ్వర్యంలో శనివారం ఐఎంఏ హాల్లో నిర్వహించిన 148వ ఎన్నీల ముచ్చట్లు సాహిత్య కార్యక్రమంంలో ఆయన మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల సాహిత్య అభిమానులు మంచి కవిత్వం కోసం కరీంనగర్‌ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. తెరవే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సీవీ కుమార్, దామరకుంట శంకరయ్య ఎన్నీల ముచ్చట్లకు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఇటీవల దాశరథి పురస్కారం స్వీకరించిన కవి అన్నవరం దేవేందర్‌ను ఆత్మ జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. కవులు ఎస్‌.రవీంద్ర, నడిమెట్ల రామయ్య, కూకట్ల తిరుపతి, డాక్టర్‌ వెల్నూల కృష్ణారావు, విజయ, జలంధర్‌రెడ్డి, విలాసాగరం రవీందర్‌ పాల్గొన్నారు.