గాంధీభవన్ కు రావొద్దా?

హైదరాబాద్: గాంధీభవన్ వేదికగా ఆదివారం ఎంపీ మల్లు రవి అధ్యక్షతన క్రమశిక్షణ కమిటీ సమావేశం అయింది. ఈ నేపథ్యంలో వరంగల్ ఇష్యూపై వివరణ ఇచ్చేందుకు కొండా మురళి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ‘క్రమశిక్షణ కమిటీ కంటే ముందే నేనే వచ్చాను.. గాంధీభవన్ కు రావొద్దా ఏంటి?’ అని అక్కడున్న పలువురిపై కొండా మురళి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా, వరంగల్ జిల్లాలో కొండా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆ జిల్లాకు చెందిన ఆయన వ్యతిరేక వర్గం అధి ష్టానానికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై మురళి కూడా క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరై ఇప్పటికే తన వాదనను వినిపించారు. అయితే నేటి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. కాగా సమావేశం అనంతరం కొండా మురళి మాట్లాడుతూ.. తన వివరణతో కమిటీ సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిపారు. తమ రక్తంలోనే కాంగ్రెస్ పార్టీ ఉందని, వేరే చోట ఇమడలేమని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో అందరితో కలిసి పని చేస్తామ న్నారు. పార్టీ ఏ ఆదేశాలిచ్చినా తప్పక పాటిస్తామని స్పష్టం చేశారు.