నా తండ్రే…నన్ను హింసించాడు!

న్యూఢిల్లీ: టాలీవుడ్ యాక్టర్ గాయత్రి గుప్తా ‘ఫిదా’, జంధ్యాల రాసిన ప్రేమకథ, సీత ఆన్ ది రెడ్, బుర్రకథ, వంటి చిత్రాల్లో లిమిటెడ్ రోల్స్లో నటించి మెప్పించారు. అలాగే టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ గురించి, బిగ్ బాస్ షోపై హాట్ కామెంట్స్ చేసి ఇదివరకే వార్తల్లో నిలిచారు. ఫెమినిజం, పురుషాధిక్యత, వస్త్రధారణ తదితర విషయాలపైనా తన వాయిస్ ని గట్టిగా వినిపించారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన ఓపెన్ కామెంట్స్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఇంటర్వ్యూలో గాయత్రి మాట్లాడుతూ.. ‘సాధారణంగా అమ్మాయిలు ఎక్కువగా తండ్రిలాంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా కోరుకుంటారు. కానీ నాకు ఫాదర్ అంటేనే అసహ్యం వేస్తుంది. నా తండ్రే నన్ను చిత్రహింసలు పెట్టాడు. కరెంట్ వైర్తో కొట్టడం, ఆ గాయాలపై కారం రాయడం వంటివి చేసి అమానుషంగా వ్యవ హరించాడు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.