17,000 కోట్ల ఆస్తి.. ఇండియాను ఏలింది.. కనిపించకుండ పోయింది…

ఇండియా 1980, 1990లతో పోలిస్తే ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. అప్పట్లో ఉన్న ప్రొడక్ట్స్ ఇప్పుడు చాలావరకు లేవు. కస్టమర్ల ఆకస్తికి తగ్గట్లు కొన్ని అప్‌డేట్‌ అయితే.. మరికొన్ని పాపులర్ బ్రాండ్లు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఈ లిస్టులో ఇండియాను ఏలిన వాషింగ్ పౌడర్ బ్రాండ్ ‘నిర్మా’ కూడా ఒకటి.

1969లో..
1969లో కర్సన్‌భాయ్‌ పటేల్ ‘నిర్మా’ కంపెనీ స్థాపించారు. తన దివంగత కుమార్తె నిరుపమకు గుర్తుగా దీనికి నిర్మా అని పేరు పెట్టారు. ఈ బ్రాండ్ పీక్‌లో ఉన్నప్పుడు రూ.17,000 కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించింది. కానీ.. కొన్ని తప్పులు కంపెనీని దారుణంగా దెబ్బ తీశాయి.

నిర్మా ఎదుగుదల…
నిర్మా స్టోరీ కర్సన్‌భాయ్‌ పటేల్ అనే రసాయన శాస్త్రవేత్తతో ప్రారంభమైంది. అప్పట్లో రూ.15 ఖర్చు అయ్యే హిందూస్తాన్ యూనిలీవర్ సర్ఫ్‌తో పోలిస్తే చాలా తక్కువకే.. కేవలం రూ.3కే నిర్మా సర్ఫ్‌ను లాంచ్ చేశారు. దీని క్లీనింగ్ క్వాలిటీ కూడా బాగుండేది. ఇది మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు ఫేవరెట్ ప్రొడక్టుగా మారిపోయింది. 1980ల నాటికి నిర్మా భారతదేశ డిటర్జెంట్ మార్కెట్లో 60 శాతం వాటా సొంతం చేసుకుంది. సర్ఫ్ వంటి బ్రాండ్లను దాటింది.

మార్కెట్‌లో ప్రచారం..
ఈ బ్రాండ్ కేవలం ధర పరంగానే కాదు.. మనీ బ్యాక్ గ్యారెంటీ వంటి క్లెవర్ స్ట్రాటజీలు బాగా పనిచేశాయి. బట్టలు శుభ్రంగా లేకపోతే మనీ వెనక్కి ఇస్తామని చేసి ప్రచారం పాపులర్ అయింది. గృహిణులు సంతోషంగా ఉండటం, ఐకానిక్ ‘జింగిల్’ అడ్వర్‌టైజ్‌మెంట్‌ ప్రొడక్టును ప్రజలకు మరింత దగ్గర చేశాయి. హేమమాలిని, రీనా రాయ్, శ్రీదేవి, సోనాలి బింద్రే వంటి బాలీవుడ్ తారలు నిర్మాకు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ చేశారు.

నిర్మా పతనం..
2000 నాటికి నిర్మా మార్కెట్ వాటా కేవలం 6 శాతానికి పడిపోయింది. దీనికి కారణం మార్కెట్ పోటీ. సర్ఫ్ ఎక్సెల్, ఏరియల్, టైడ్ వంటి మల్టినేషల్ బ్రాండ్స్ భారత్‌లో అడుగు పెట్టాయి. ఈ కంపెనీలు అడ్వాన్స్‌డ్‌ స్ట్రైన్ రిమూవల్ ఫార్ములాస్, మోడర్న్ ప్యాకేజింగ్, అగ్రెసివ్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ తీసుకొచ్చాయి. ఇవి మధ్యతరగతి కుటుంబాలను ఆకర్శించాయి. నిర్మా వీటిని అందుకోవడంలే విఫలమైంది. అప్పటి నుంచి కంపెనీ పతనం మొదలైంది.

అదే కారణం
ఇతర కంపెనీలు కొత్త ప్రొడక్ట్ వేరియంట్స్ లాంచ్ చేశాయి, క్వాలిటీ ఇంప్రూవ్ చేశాయి. కానీ.. నిర్మా దాని బేసిక్ ఫార్ములా.. ప్యాకేజీకి కట్టుబడి ఉంది. ఇన్నోవేషన్ లేకపోవడంతో బ్రాండ్ పాతదనే పేరు వచ్చేసింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడంతో, ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో వినియోగదారులకు నిర్మా ‘చీప్’ ప్రొడక్టుగా కనిపించింది. దీంతో ప్రీమియం ప్రొడక్టులపై ఆసక్తి చూపడం ప్రారంభించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా బ్రాండ్ మారకపోవడమే పతనానికి కారణం.

అదే సమయంలో నిర్మా కంపెనీ సిమెంట్, కెమికల్స్, ఎడ్యుకేషన్ వంటి సంబంధం లేని వ్యాపారాలలోకి అడుగు పెట్టింది. ఇదే సమయంలో నిర్మా బిజినెస్‌పై ఫోకస్‌ తగ్గింది. వేర్వేరు రకాల వ్యాపారాలను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించిన హిందూస్తాన్ యూనిలీవర్ కంపెనీల తరహాలో నిర్మా సక్సెస్ కాలేకపోయింది.

మార్పును అందుకోకపోతే..
నిర్మా జర్నీ ఇన్నేవేషన్, అడాప్టబిలిటీ అవసరాన్ని గుర్తు చేస్తుంది. స్మార్ట్ స్ట్రాటజీలతో, ఒక సింపుల్ ఐడియాతో ఎంతపెద్ద వ్యాపార సామ్రాజ్యం క్రియేట్ చేయవచ్చో చూపింది. అలానే మారుతున్న మార్కెట్లు, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందకపోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయో కూడా తెలిపింది.