కరీంనగర్: సాగుకాలం కరిగిపోతుండగా.. రైతులకు యూరియా వ్యథ తప్పడం లేదు. కొరత లేదని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అన్నదాతలు కష్టాలు పడుతునే ఉన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్కెపల్లి సహకార సంఘం గోదాంకు శనివారం మధ్యాహ్నం లారీలో 230 బస్తాలు వచ్చాయి. 500మంందికి పైగా రైతులు గోదాం వద్దకు చేరుకున్నారు. మహిళలు, వృద్ధులు క్యూలో నీరసించారు. సహకార సిబ్బంది ఒక్కరికి ఒక బస్తా చొప్పున టోకెన్లు ఇచ్చారు. యూరియా అందని రైతులు నిరాశతో వెనుదిరిగారు. శంకరపట్నం మండలం లింగాపూర్ గోదాంకు లారీ యూరియా వచ్చింది. 15 రోజుల క్రితం ఆధార్‌జిరాక్స్ తీసుకున్న వారికే టోకెన్లు ఇవ్వడంతో ఓ రైతు యూరియా ఇవ్వకుంటే షట్టర్ మూసివేస్తానని సిబ్బందితో వాదనకు దిగాడు. పోలీసు బందోబస్తుతో 450 బస్తాలను రైతులకు అందించారు. చిగురుమామిడి మండలం ఇందుర్తికి శనివారం లారీ లోడ్ వచ్చింది. ఆదివారం పంపిణీ చేస్తామని నిర్వాహకులు చెప్పడంతో రైతులు తమ చెప్పులను క్యూలో విడిచి వెళ్లారు.
యూరియా.. దొరకదయా
