ఉత్తమ ఉపాధ్యాయులు 60 మంది

కరీంనగర్: భారత మొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ప్రదానం చేసే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు జిల్లాలోని 60 మంది జాబితాను డీఈవో చైతన్యజైనీ మంగళవారం ప్రకటించారు. బుధవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన 60 మందిని సత్కరించనున్నట్లు వెల్లడించారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్‌ పమేలా సత్పతి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్ పాల్గొంటారని పేర్కొన్నారు.

60 మంది వీళ్లే
ఎండీ ముస్తాఫ్‌ అహ్మద్‌(సవరన్‌ స్కూల్, కరీంనగర్‌), మల్లికార్జున్‌(జెడ్పీహెచ్‌ఎస్‌ బూర్గుపల్లి),  .రామయ్య(గన్నేరువరం), శ్రీనివాస్‌(ఎంపీయూపీఎస్‌ మానకొండూరు), కె.వెంకటేశ్వర్లు(జెడ్పీహెచ్‌ఎస్, సింగాపూర్), గంగారాం(ఎలగందల్), టి.సత్యనారాయణ(మన్నెంపల్లి), పి.శ్రీధర్‌(రుక్మాపూర్), పతి పద్మ (మల్యాల), ఉమారెడ్డి, సువిత (చల్లూర్), వసుంధర(జంగపల్లి), వినయేందర్‌రాజు(ముదిమాణిక్యం), బి.వేణుమాధవ్‌(ఎంపీపీఎస్‌ మాచనపల్లి), జి.మధుకుమార్‌(జెడ్పీహెచ్‌ఎస్‌ ఎక్లాస్‌పూర్), ఎస్‌.సత్యనారాయణచారి (జీహెచ్‌ఎస్‌ ఖార్ఖానగడ్డ), రాజేశం(ఎంపీయూపీఎస్‌ కొండయ్యపల్లి, గంగాధర), భుజన్‌చందర్‌(జడ్పీహెచ్‌ఎస్‌ ఉటూర్), ఎస్‌.వెంకటేశ్వర్లు(వెల్ది), ఎం.సవిత (ఇందుర్తి), జూపాక సత్యవతి(ర్యాలపల్లి), టి.శ్రీనివాస్‌(టీజీఎంఎస్‌ ఎలగందల్), బాలాజీ లకావత్‌(తిమ్మాపూర్‌), ఆర్‌.శ్రీనివాస్‌(రామడుగు), ముక్తీప్రసాద్‌(ముల్కనూర్), జి.లత(జీపీఎస్‌ కిసాన్‌నగర్), రవీందర్‌(ఎంపీపీఎస్‌ రాగంపేట), జానకి దేవి(దుర్శెడ్), సి.లక్ష్మారెడ్డి (బొమ్మకల్), వై.కృష్ణవేణి(గర్శకుర్తి), జి.మధుసూధన్‌ (టీజీఎంఎస్‌ రుక్మాపూర్), ఆర్‌.శ్రీనివాస్‌(ఎంపీపీఎస్‌ రుద్రారం), జి.సత్యం(హిమ్మత్‌నగర్), పి.శారద(శాలపల్లి), బి.కనుకయ్య(రాగంపేట), ఏ.శ్రీనివాస్‌(ధర్మరాజుపల్లి), బి.సంధ్య(వెంకటాయిపల్లి), కె.చంద్రకళ(గట్టుభూత్కుర్), పి.నాగరాణి(నల్లగొండ), ఎం.సహాదేవ్‌(ముంజంపల్లి), న్యూర్‌ ఎలాహి(జీపీఎస్‌ కరీంనగర్‌), సి.పద్మ(ఎంపీపీఎస్‌ రామంచ), జి.శారద(మల్లాపూర్)తో పాటు 17 మంది ప్రైవేట్‌ ఉపాధ్యాయులు పురస్కారాలు అందుకోనున్నారు.