ట్రెసా జిల్లా అధ్యక్షుడిగా వెంకట్‌రెడ్డి

కరీంనగర్‌: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) జిల్లా అధ్యక్షుడిగా నల్ల వెంకట్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ట్రెసా జిల్లా కమిటీ ఎన్నికలు మంగళవారం రెవెన్యూ భవన్‌లో నిర్వహించారు. ఆఫీస్‌ సబార్డినేట్‌ నుంచి తహసీల్దార్‌ వరకు జిల్లా రెవెన్యూ ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొని 2025-28 సంవత్సరానికి గానూ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నల్ల వెంకట్‌రెడ్డి(జమ్మికుంట తహసీల్దార్‌), ప్రధాన కార్యదర్శిగా పెద్ది విజయ్‌కుమార్‌(నాయబ్‌ తహసీల్దార్‌), కోశాధికారిగా ఇ.సంతోష్‌కుమార్‌(గిర్దావర్‌), అసోసియేట్‌ అధ్యక్షులుగా కలెక్టరేట్‌ ఏవో గడ్డం సుధాకర్, ఎన్‌.రాజేష్‌(తహసీల్దార్, కరీంనగర్‌ రూరల్‌), ఉపాధ్యక్షులుగా ముబీన్‌ అహ్మద్, మాధవి, విశాలి, కమ్రుద్దీన్, సురేందర్, ఆర్గనైజింగ్‌ సెక్రటరీలుగా షరీఫ్, సుమలత, త్రిపాల్, లక్ష్మారెడ్డి, జాయింట్‌ సెక్రటరీలుగా శంకర్, సందీప్, ఉష, రంజిత్‌రెడ్డి, అంజయ్య, స్పోర్ట్స్‌, కల్చరల్‌ సెక్రటరీలుగా బషీర్, భవాని, జిల్లా కమిటీ మెంబర్లుగా అన్వర్, కమలేశ్‌, అరుణ్, శంకర్, బాలకిషన్, అజహర్, కిషన్‌రెడ్డి, అనిల్, అనిల్‌కుమార్, రాజలింగం, అశోక్, సంపత్, కొమురయ్య నియామకం అయ్యారని ఎన్నికల అధికారి (ట్రెసా రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులు) రాజ్‌కుమార్‌ వివరించారు. ఎన్నికల పరిశీలకుడిగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మహేశ్‌ వ్యవహరించాడు. తహసీల్దార్లు గుర్రం శ్రీనివాస్, నవీన్, సుమన్, విజయ్, శ్రీనివాస్‌ రెడ్డి, రాజమల్లు పాల్గొన్నారు.