జగిత్యాల: స్నేహితుల మధ్య కేక్ కట్ చేయడానికి కత్తులు, కడ్డీలు వాడతారని విన్నాం కానీ… తల్వార్‌తో కేక్ కట్ చేస్తే ఎలా ఉంటుందో చూపించాడు ఓ యువకుడు. జగిత్యాల జిల్లా కేంద్రం వాణినగర్‌కు చెందిన కోరుకంటి సాయికృష్ణ తన బర్త్‌డే సందర్భంగా కేక్‌పై తల్వార్ ఝలక్ చూపించి హల్‌చల్ చేశాడు. ఆ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. “బర్త్‌డే సెలబ్రేషన్‌నా.. లేక సినిమా స్టైల్ డేంజరస్ యాక్షన్ సీన్‌నా?” అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇదే విషయంపై స్పందించిన జగిత్యాల పట్టణ పోలీసులు.. పబ్లిక్ ప్లేస్‌లో తల్వార్ ప్రదర్శన చేసినందుకు సాయికృష్ణపై కేసు నమోదు చేశారు. ఇక ఈ బర్త్‌డే బాయ్‌కు జైలు గేట్ల దగ్గర “గిఫ్ట్” రెడీ అయిందన్న మాట.
పుట్టినరోజు…తల్వార్ తో కేక్ కట్!
