కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మసీదులు, ఈద్గా, దర్గా, ఖబ్రస్తాన్ వివరాలను ఉమీద్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని సూచించారు. మంగళవారం నగరంలోని కరీంనగర్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ప్రాపర్టీ వివరాలు పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు. నిర్ణీత గడువు డిసెంబర్ 6వ తేదీలోగా వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. అనంతరం ఉమీద్ పోర్టల్‌లో వివరాలను ఎలా నమోదు చేసుకోవాలో మసీదు, ఈద్గా,దర్గా, ఖబ్రస్తాన్ ప్రతినిధులకు ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎండీ.తాజొద్దిన్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు అక్బర్ అలీ, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు సాహెబ్, నాయకులు సమద్ నవాబ్, లాయక్ ఖాద్రీ, నేహాల్ అహ్మద్, అబ్దుల్ రెహమాన్,ఖమరొద్దిన్, మోసిన్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.
ఉమీద్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి
