కామారెడ్డి: ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తి డెడ్‌బాడీని త్రీవీలర్‌పై తీసుకెళ్లారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కల్యాణి గ్రామంలో జరిగింది. వివరాలు.. కల్యాణి గ్రామానికి చెందిన బండారి సాయిలు(42) గురువారం వ్యక్తిగత కారణాలతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. అయితే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించడానికి గ్రామంలో వాహనాలు అందుబాటులో లేకపోవడంతో అదే గ్రామానికి చెందిన వికలాంగుడు.. మాజీ సర్పంచ్ అయిన మైదపు శ్రీనివాస్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సహకారంతో తన మూడుచక్రాల స్కూటీపై మృతదేహాన్ని ఎల్లారెడ్డి ఏరియా హాస్పిటల్‌కు తరలించేందుకు బయలుదేరాడు. విషయం ఆనోటా ఈనోట తెలుసుకున్న పోలీసులు జిల్లాలోని తిమ్మారెడ్డి గేట్ వద్ద ఆపి ట్రాక్టర్ సమకూర్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం గదికి తరలించారు.


