కరీంనగర్: ప్రభుత్వం పేద ప్రజలకు అందించే రేషన్ బియ్యాన్ని రేషన్ షాపు నుంచి లబ్ధిదారుని ఇంటికి చేర్చేందుకు ఫ్రీ ఆటో సౌకర్యం కల్పించారు ఎంఐఎం లీడర్. కరీంనగర్‌లోని 34 డివిజన్ బొమ్మకల్ సలాఫీనగర్, విజయనగర్ కాలనీ, హుస్సేనీపుర ప్రాంతాలకు చెందిన రేషన్ లబ్ధిదారుల ఇంటికి ఉచితంగా చేరవేయడానికి ఆ డివిజన్ ఎంఐఎం అధ్యక్షుడు మహమ్మద్ ఖాజా మజారుద్దీన్ ఏర్పాటు చేసిన ఆటోను బుధవారం ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆరీఫ్ అహ్మద్, డివిజన్ నాయకులు సాజిద్, తాజొద్దీన్, లారీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సాజిద్, సుధాకర్, నరేశ్, సుదర్శన్, శ్రీనివాస్, చరణ్, చిన్నా, రజాఖ్, యాఖుబ్ తదితరులు పాల్గొన్నారు.

