ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి గ్రామ సర్పంచ్‌గా గెలిపిస్తే సొంత ఖర్చులతో గ్రామంలో ప్రధానంగా అవసరమున్న ఆరు హామీలను నెరవేరుస్తానని… బీజేపీ బలపర్చిన అభ్యర్థి దాసరి గణేశ్ బుధవారం గ్రామస్తులకు బాండ్ పేపర్ రాసిచ్చారు. ఇచ్చిన హామీలను సొంత ఖర్చులతో అమలు చేయకపోతే గెలిపించిన నెలలోపే గ్రామస్తుల సమక్షంలో రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనపై నమ్మకంతో గ్రామస్తులందూ తన ఎన్నికకు సహకరించాలని కోరారు.


