- బీజేపీ ఖాతాలో ముస్తాబాద్ ‘మేజర్’ పంచాయతీ
కరీంనగర్: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మూడో విడత ఎన్నికల్లో బీజేపీ సత్తాచాటింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీని బీజేపీ కైవసం చేసుకుంది. అక్కడ పార్టీ సీనియర్ లీడర్ మట్టవెంకటేశ్వర్‌రెడ్డి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలం సైదాబాద్ సర్పంచ్‌గా పుప్పాల రాజారాం ఎన్నికయ్యారు. ఈయన వరుసగా మూడుసార్లు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. మూడో విడతలో తిరిగి సర్పంచ్‌గా ఎన్నికైన ఆయన బుధవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఇదే నియోజకవర్గంలో రాంపూర్ సర్పంచ్ గా ముశం సంగీత గణేశ్ విజయం సాధించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో గెలుపొందినట్లు ఆయన ప్రకటించారు.


