- రూ.50 కోట్లు తెస్తే డంపింగ్ యార్డును తరలించకలేకపోతున్నరు
- బీఆర్ఎస్ ను గెలిపిస్తే…కబ్జాలు చేసి జైలు పాలయ్యారు
- కాంగ్రెస్ ను గెలిపిస్తే… రెండేళ్లుగా కార్పొరేషన్ కు నయాపైసా ఇయ్యలే
- మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే వరదలా నిధులు తెస్తా
- కరీంనగర్ కు నిరంతరాయంగా నీళ్లిస్తా… డంపింగ్ యార్డును తరలిస్తా
- పన్నులు పెంచకుండా కరీంనగర్ లో అభివ్రుద్ధిని కొనసాగిస్తా
- బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే జాగాలిప్పిస్తారు.. ఇండ్లు కట్టిస్తారు
- కాంగ్రెస్, బీఆర్ఎస్ లను గెలిపిస్తే…మీ జాగాలను కబ్జా చేస్తారు
- మేం అభివృద్ధి నినాదం తో ఓట్లు అడుగుతున్నాం
- వాళ్ళు మతం పేరుతో రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకుంటున్నారు
- ఇయాల రేవంత్ రెడ్డి వస్తే, రేపు ఓవైసీని తీసుకొచ్చి రెచ్చగొడుతున్నారు
- ఆలోచించి ఓటేయండి..బీజేపీని ఆశీర్వదించండి
- బొమ్మకల్, కృష్ణానగర్, గాంధీ బొమ్మ, సీతారాంపూర్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ కు నిరంతరాయంగా నీళ్లను అందించేందుకు కేంద్రం నుంచి రూ.134 కోట్లను తీసుకొస్తే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలకులు ఆ నీళ్లను కూడా అందించలేకపోయాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. డంప్ యార్డ్ తరలింపు కోసం కేంద్రం నుండి రూ.50 కోట్లు తెస్తే ప్రస్తుత పాలకులు డంపింగ్ యార్డును కూడా తరలించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ను గెలిపిస్తే.. కబ్జాలు చేసి జైలు పాలయ్యారని, కాంగ్రెస్ ను గెలిపిస్తే… రెండేళ్లుగా కార్పొరేషన్ కు నయాపైసా ఇవ్వడం లేదని విమర్శించారు. పొరపాటున ఆ రెండు పార్టీలకు ఓట్లేస్తే పన్నులు పెంచి జనం నడ్డి విరుస్తారని హెచ్చరించారు. మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే వరదలా నిధులు తెస్తానని, కరీంనగర్ కు నిరంతరాయంగా నీళ్లిస్తానని హామీ ఇచ్చారు. ప్రత్యామ్నాయ స్థలం కోసం తీర్మానం చేయడంతోపాటు డంపింగ్ యార్డును సైతం తరలిస్తానని భరోసా ఇచ్చారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బొమ్మకల్, క్రిష్ణానగర్, గాంధీ బొమ్మ, సీతారాంపూర్ హనుమాన్ చౌరస్తా ప్రాంతాల్లో 6, 34, 54, 53, 65,1, 23 డివిజన్ల అభ్యర్థులు మేకల వెంకటేశ్, ఎలగందుల నందకుమార్, గొట్టిముక్కల ఉమా వెంకటరమణ, కొంపెల్లి శ్వేత రమణ్ కుమార్, కమటం తిరుపతి, బారి అపర్ణ, పాదం శివరాజ్ లను గెలిపించాలని అభ్యర్ధిస్తూ ప్రచారం నిర్వహించారు. బీజేపీ ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగుల్లో పాల్గొని ప్రసంగించారు.
బొమ్మకల్ లో…
మినీ బంజర హిల్స్ లో ఉండాల్సిన బొమ్మకల్ అనాథగా మారడానికి కారణం కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులే. గత బిఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఎన్నడు పట్టించుకున్న పాపాన పోలేదు. బొమ్మకల్ గ్రామపంచాయతీ ద్వారా రూ. 50 కోట్ల వరకు ఆదాయం వస్తుంటే…గత పాలకులు ఈ గ్రామాన్ని కరీంనగర్ కార్పొరేషన్ లో కలిపినా ఎన్నడూ పట్టించుకోలేదు. బైపాస్ రోడ్డులలో గతంలో ఎప్పుడూ రాత్రివేళ ప్రమాదాలు జరిగేది. ఈ ప్రాంత ప్రజలు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ముప్పును నివారించేందుకు.. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాజీవ్ రహదారి దారిపొడుగున సెంట్రల్ లైటింగ్ సిస్టం ను నేను ఏర్పాటు చేయించాను. పొరపాటున కాంగ్రెస్ ను గెలిపిస్తే.. మీ ఇంటి పన్నులు కూడా పెంచి మిమ్మల్ని దివాలా తీస్తారు. ఇంటి పన్ను పెరగదు ఇక్కడ అభివృద్ధి జరగాలంటే మా అభ్యర్థిని గెలిపించండని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు.
కృష్ణానగర్ లో….
యజ్ఞ వరాహ స్వామి టెంపుల్ ఏరియా, కాపు వాడ, కృష్ణానగర్ లలో ఈరోజు రోడ్లు మనం నడిచేందుకు వీలుగా ఉన్నాయి.. వాహనాలు వెళ్లేందుకు సులువుగా ఉన్నాయంటే.. దానికి కారణం కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సీటీ నిధులే..
నేను రూ.134 కోట్ల నిధులు తెస్తే… నీళ్లు కూడా ఇవ్వలేని అసమర్ధులు కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులు. కేంద్రం నుండి రూ.50 కోట్లు తెస్తే డంపింగ్ యార్డును తరలించకలేకపోతున్నరు. మీరు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపిస్తే…కబ్జాలు చేసి జైలు పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే… రెండేళ్లుగా కార్పొరేషన్ కు నయాపైసా ఇయ్యలేకపోయారు. ఆ రెండు పార్టీలకు ఓట్లేస్తే పన్నులు పెంచి జనం నడ్డి విరుస్తారు. మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే వరదలా నిధులు తెస్తా. కరీంనగర్ కు నిరంతరాయంగా నీళ్లిస్తా… డంపింగ్ యార్డును తరలిస్తా. పన్నులు పెంచకుండా కరీంనగర్ లో అభివ్రుద్ధిని కొనసాగిస్తా. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే జాగాలిప్పిస్తారు…ఇండ్లు కట్టిస్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లను గెలిపిస్తే… మీ జాగాలను కబ్జా చేస్తారు. ఆలోచించి ఓటేయండి…బీజేపీని ఆశీర్వదించండి అని కేంద్ర మంత్రి కోరారు.

గాంధీ రోడ్డులో….
గాంధీ రోడ్డు, వైశ్య భవన్, రాజీవ్ చౌక్ ,వీక్లీ మార్కెట్, నాక చౌరస్తా అశోక్ నగర్ ఈ ప్రాంతంలో సిసి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ మెరుగవడానికి కేంద్ర ప్రభుత్వం నిధులే కారణం. బొమ్మ ఎంకన్న ఇంటి వరకు రోడ్డు అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్ల ఉందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడున్న ఈ గాంధీ జంక్షన్ కూడా స్మార్ట్ సిటీ నిధులతోనే సుందరంగా తీర్చిదిద్దాం. నగరం నగడి బొడ్డున ఉన్న ఈ అశోక్ నగర్ సాయి నగర్ శర్మ నగర్ సాయి నగర్ లో మంచినీటి సౌకర్యం విషయంలో కొంత ఇబ్బంది ఉందని నా దృష్టికి వచ్చింది. కరీంనగర్ మేయర్ గా బీజేపీ అభ్యర్థి ఎన్నికైన కొన్ని నెలల్లోనే ఇక్కడ తాగునీటి ఇబ్బంది తీరుస్తాను. ప్రస్తుతం దినం తప్పించి దినం వస్తున్న నీళ్లను ప్రతినిత్యం అందే విధంగా చొరవ చూపిస్తాను. అమృత్ 2.0 కింద 147 కోట్లు నగరానికి వచ్చాయి అందులో పైప్ లైన్ లో రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతుంది అది పూర్తవుగానే తాగునీటికి కటకటా లేకుండా. పోతుంది. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా కార్ఖానా గడ్డ హైస్కూల్లో సుమారు 1000 మంది పేద విద్యార్థులు చదువుతున్నారు. వారికి ఉచితంగా సైకిళ్లను ఇచ్చాను. అంతేకాకుండా కార్పొరేట్ స్కూల్ మాదిరిగా డిజిటల్ స్మార్ట్ బోర్డులను ఏర్పాటు చేసి వాళ్లకు విద్య బోధన అందిస్తున్నాం. పిల్లలందరూ ట్యాబు లాప్టాప్లను యూస్ చేసి చదువుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడి లేనివిధంగా ఇక్కడ ప్రభుత్వ విద్యార్థులకు అది నేను కేంద్ర ప్రభుత్వం నిధులను అందించడం ఆనందంగా ఉంది. మేం అభివృద్ధి నినాదం తో ఓట్లు అడుగుతున్నాం. వాళ్లు మతం పేరుతో రెచ్చకొట్టి లబ్ధి పొందాలనుకుంటున్నారు. ఇయాల రేవంత్ రెడ్డి వస్తే, రేపు వాళ్ళ అన్న ఓవైసీని తీసుకొచ్చి రెచ్చగొట్టపోతున్నారు.
సీతారాంపూర్ లో…
సీతారాంపూర్ ఆరేపల్లి ఈ ప్రాంతంలో గతంలో ఉన్న మాజీ సర్పంచులు మాజీ కార్పొరేటర్లు అసలు అభివృద్ధిని పట్టించుకోలేదు. వాళ్ల స్వలాభం కోసమే ఆ పదవుల్ని మీ అందరి ఓట్ల ద్వారా అందుకున్నారు. కానీ.. ఇక్కడ ప్రజలకు వాళ్ళు ఒరగబెట్టింది ఏమీ లేదు. భూ దందాలతో రెచ్చిపోయారు అందిన జానేడు జాగను కూడా ఆక్రమించుకున్నారు. ఆరేపల్లి సీతారాంపూర్ లో ప్రస్తుతం తాగునీటి పైప్లైన్ల పనులు జరుగుతున్నాయి. అవన్నీ అమృత్ 2.0 కింద రూపాయలు 147 కోట్లతో కేంద్ర ప్రభుత్వం వచ్చిన పైసలతోనే జరుగుతున్నాయి. ట్యాంకులు, పైప్ లైన్లు రిజర్వాయర్లు, సంపౌజులు కడుతున్నారు.
అవన్నీ మోది గారు ఇచ్చిన పైసలే..
వాళ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే.. మేము ప్రజల దాహార్తిని తీరుస్తున్నాం. నిధులు నిధులు ఇచ్చి నీళ్లు తాగించేది మేము. భయపెట్టి భూదందాలు చేసేది వాళ్లు.. పేదల పక్షాన కొట్లాడేది మేము… మా వాళ్లు గరీబోళ్లు… వాళ్లలో కొందరు గలీజోళ్లు.. బోత్ ఆర్ నాట్ సేమ్. కరీంనగర్ లో బీజేపీ జోష్ ని చూసి కరీంనగర్ లో ఒక నాయకుడికి హైబీపీ వచ్చిందట. మరొక నాయకుడికి లోబీపీ వచ్చిందట. కట్టు కథలు చెప్పుట్ల.. హామీల కోతలు కోసుట్ల కాంగ్రెస్ వాళ్ళు ధీరులు.. బురిడీ కొట్టించడంలో, భూములు కబ్జాలు చోట్ల.. ప్రజల పైసలు మింగుట్ల.. బీఆర్ ఎస్ వాళ్ళు శూరులు అని కేంద్ర మంత్రి మండిపడ్డారు.

