ఘనంగా వీడ్కోలు వేడుక

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సెలెస్టీయల్‌ హైస్కూల్‌లో శనివారం రాత్రి వీడ్కోలు వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్‌ ఆడిపాడారు. పాఠశాల యాజమాన్యం పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులను సన్మానించింది. కార్యక్రమంలో స్కూల్‌ డైరెక్టర్లు వై.హన్మంతరెడ్డి, బి. శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ కృష్ణామాచారి, వైస్‌ ప్రిన్సిపాల్‌ విక్రమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.