జగిత్యాల: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి సోమవారం సాయంత్రం 39 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 1,25,400 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 2,26,867 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. వరదకాలువకు 18వేల క్యూసెక్కులు, కాకతీయ కాల్వకు 4700 క్యూసెక్కుల చొప్పున వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 73.370 టీఎంసీలకు చేరింది.
ఎస్సారెస్పీ 39 గేట్ల ఎత్తివేత
