పెద్దపల్లి: పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లకిడి భాస్కర్‌ను తొలగించడంతో పాటు బార్ కౌన్సిల్ సభ్యత్వం నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ బార్ కౌన్సిల్ తీర్మానించినట్లు బార్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం పెద్దపల్లిలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. అధ్యక్షుడిగా ఉన్న భాస్కర్ బార్‌సభ్యుల ఆలోచలనకు వ్యతిరేకంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. వచ్చే నాలుగు నెలలపాటు అసోసియేషన్ వైస్‌ప్రెసిడెంట్ ఠాకూర్ అజయ్ క్రాంతిసింగ్ అధ్యక్షుడిగా కొనసాగుతారని వివరించారు.
పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడి తొలగింపు
