గంభీరావుపేట: నాబార్డు అనుబంధ సంస్థ అయిన బ్యాంకర్స్ ఇన్సిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్(బర్డ్) పాలక మండలి సభ్యుడిగా ఎన్నికైన రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన మాజీ టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావును గంభీరావుపేట మండల బీఆర్ఎస్ నాయకులు మంగళవారం సన్మానించారు. వరుసగా మూడోసారి పాలకమండలి సభ్యునిగా ఎన్నిక కావడం పై హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో శాలువాలతో, పుష్పగుచ్చాలతో సత్కరించారు. సహకార వ్యవస్థ బలోపేతానికి రవీందర్రావు చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణశాఖ అ«ధ్యక్షులు వెంకటస్వామిగౌడ్, వెంకటి యాదవ్, ప్రధాన కార్యదర్శి గంధ్యాడపు రాజు, సెస్ మండల డైరెక్టర్ నారాయణరావు, ఉపసర్పంచ్ లక్కిరెడ్డి కమలాకర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ లింగం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
బర్డ్ పాలకమండలి సభ్యుడు రవీందర్‌రావుకు సన్మానం
